
MAKNEWS
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం రేవతి నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఇల్లంతకుంట మండలంలో పదో తరగతి పరీక్షల్లో సెకండ్ ర్యాంకు సాధించిన బి వర్షిణికి పదివేల రూపాయల నగదు బహుమతి తో పాటుగా, పాఠశాలలో 500 మార్కులు పైగా సాధించిన మరో నలుగురు విద్యార్థి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల చొప్పున నగతు బహుమతిని ఆమె అందజేశారు. కార్యక్రమం లో తల్లల్లపల్లి సర్పంచ్ మీసాల కనకరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ యం లీల, ఉపాధ్యాయులు సింగిరెడ్డి వీరారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరు పాల్గొన్నారు.