
MAKNEWS
ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న బాలికలు పోతరాజులు వేషధారణలో.. అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. నెత్తిపై బోనాన్ని ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ నృత్యాలు చేసుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శిరీష, ఉపాధ్యాయునులు, విద్యార్థినులు పాల్గొన్నారు.