
MAKNEWS అనుమతి లేకుండా నిర్మాణం… ఎంపీడీవోకు ఫిర్యాదు
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మించిన ఇంటి కి .. నల్ల పర్మిషన్ పంచాయతీ కార్యదర్శి ఇచ్చాడని గ్రామానికి చెందిన కర్ల వంశీ ఎంపీడీవో వై శశికలకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి లేని ఇంటికి నల్ల పర్మిషన్ ఎలా ఇస్తారని గ్రామానికి చెందిన కొంతమంది వార్డు సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని సూచించారు.