
MAKNEWS ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ USPC పిలుపుమేరకు దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని తహాసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఇల్లంతకుంట మండల తహాసీల్దార్ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ USPC నాయకులు భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ మరియు విద్యారంగ సమస్యలు సత్వర పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు.

ముఖ్యమైన డిమాండ్స్:
1)PRC నివేదిక తెప్పించి వెంటనే అమలు చేయాలి.
2) 6 విడుతల DA లు వెంటనే మంజూరు చేయాలి.
3)2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి.
4) G. O 25 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండేలా సవరించాలి.
5) ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు చేపట్టాలి.
6) కేజీబీవి ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి.
7)B Ed అర్హతలు ఉన్న ఉపాధ్యాయులందరికీ సీనియార్టీ ప్రకారం పిఎస్ హెచ్ఎం ప్రమోషన్లు కల్పించాలి.
8) మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 జీరో కింద జీతాలు చెల్లించాలి.
9) విద్యార్థిని విద్యార్థులకు సరిపడా పుస్తకాలు యూనిఫార్మ్స్ వెంటనే అందించాలి.
10) మధ్యాహ్న భోజనంలో మెను సవరించాలి. మధ్యాహ్న భోజన వర్కర్లకు నెలనెలా జీతాలు అందించాలి.
11) ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ EHS లో ఉపాధ్యాయుల జీవితంలో కోత విధిస్తున్నప్పటికీ ఏ ఒక్క ఉపాధ్యాయునికి సరైన ట్రీట్మెంట్ అందడం లేదు. అన్ని ఆసుపత్రులలో వైద్యం అందేలా చూడాలి.
ఈ కార్యక్రమంలో కొమ్ము రమేష్ BTF రాష్ట్ర అధ్యక్షులు, తూముకుంట నరేందర్ రెడ్డి DTF మండల అధ్యక్షులు, రామేశ్వర్ రెడ్డి DTF రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్, సుద్దాల రమేష్ ప్రధాన కార్యదర్శి ,ఆడెపు సంపత్ కుమార్ BTF మండల అధ్యక్షులు, లావుడియా శ్రీనివాస్ TPTF మండల అధ్యక్షుడు, కాసారపు కృష్ణారెడ్డి, వేముల అశోక్ రెడ్డి, పత్తి వంశీధర్ రెడ్డి, సుద్దాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.