
MAKNEWS
రహీం ఖాన్ పేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి. గంగాధర్ సూచించారు. https://tgms.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఎంపీసీ, బైపీసి, సీఇసీ, ఏసీఈ గ్రూపులలో 40 చొప్పున సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
26 న దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా, 27 న ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.
28 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.