
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
MAKNEWS/ఇల్లంతకుంట
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ నేతృత్వంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరుగుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న అన్నారు. ముస్కాన్ పేట శివారులో గల సింగిరెడ్డి వీరారెడ్డి వ్యవసాయ భూమిలో బుధవారం గాలిపల్లి-ఇల్లంతకుంట గ్రామాల మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నీ ని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి,సెస్ డైరెక్టర్ మళ్లుగారి రవిందర్ రెడ్డి లతో కలిసి మూడవ రోజు టోర్నీ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడాలని, ఆటల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధీ నుంచి 14 జట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
క్రికెట్ టోర్నీ జరుగుతున్న క్రీడామైదానం వద్ద అన్నీ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ప్రథమ బహుమతి 50000, ద్వితీయ బహుమతి 20000లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మండల స్థాయిలో క్రికెట్ టోర్నీ పూర్తి అయ్యాక మండల స్థాయిలో గెలుపొందిన జట్టును జిల్లా స్థాయిలో జరిగే క్రికెట్ టోర్నీకి పంపడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి లీగ్ మ్యాచ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు.
గ్రామీణ యువత ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రీడా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.జిల్లా స్థాయిలో మొదటి బహుమతి 200000లు, ద్వితీయ బహుమతి 100000 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహాకులు రాగటి రమేష్, ఎండి సాదుల్, సావనపెల్లి అనిల్, కేవిఎన్ రెడ్డి, కౌముటం రాములు, బద్దం శేఖర్ రెడ్డి, రడం ప్రవీణ్, ఎడ్ల ప్రశాంత్ రెడ్డి, ఎండ్ర చందన్ తదితరులు పాల్గొన్నారు.
