
-వల్లంపట్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉద్రిక్తత
-సర్పంచ్ దంపతుల అరెస్టుపై మాజీ సర్పంచుల ఫైర్
-బిల్లులు అడుగుతే… కేసులు పెడతారా అంటూ మాజీ సర్పంచుల ఆగ్రహం
maknews /ఇల్లంతకుంట
ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో నిర్మాణం చేపట్టిన కూడా… ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులకు తాళం వేసి నిరసన తెలుపుతున్న సర్పంచ్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సర్పంచ్ దంపతులు పాఠశాల తరగతి గదులకు తాళం వేసి నిరసన తెలుపగా, పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మళ్లీ తిరిగి వల్లంపట్ల మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, తన భర్త కేతిరెడ్డి నరసింహారెడ్డిలు కలిసి, పాఠశాల తరగతి గదికి తాళం వేశారు. దీంతో ఈ విషయం కాస్త పోలీసులకు సమాచారం చేరవేయడంతో, వెంటనే ఎస్సై సిరిసిల్ల అశోక్ కుమార్ నేతృత్వంలో తన సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో చేరుకున్నారు. పాఠశాల గదికి తాళం వేయడం చట్ట విరుద్ధమని, మీ సమస్య ఉంటే, ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి, తీసుకువెళ్లాలని ఎస్ఐ సూచించారు. అయినా సర్పంచ్ దంపతులు వారి ఆందోళన నిరసన విరవింపంప చేయక పోవడంతో, ఎస్సై అశోక్ కుమార్..మాజీ సర్పంచ్ దంపతులిద్దరిని తన వాహనంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
బిల్లులు అడుగుతే అక్రమంగా అరెస్టు చేశారు…
తాము సర్పంచ్ గా ఉన్నప్పుడు, గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో, విద్యార్థులు మంచిగా చదవాలని, సుమారుగా 44 లక్షల రూపాయల నిధులతో అదనపు తరగతి గదులను నిర్మించామన్నారు. అయితే వీటిలో 20 లక్షల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం, చేయడం లేదని, దీంతో ఆవేదనతో, పాఠశాల గదికి తాళం వేసి నిరసన తెలిపామని , దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్బలంతో మాపై అక్రమంగా కేసులు పెట్టించారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, కేతిరెడ్డి నరసింహారెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో కూడా, 15 లక్షల నిధులు తమకు రావాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి చేస్తే… మాకు ఇలా పోలీసులతో అరెస్టు చేయించడం చాలా బాధగా ఉందని, సర్పంచి దంపతులు పేర్కొన్నారు. కనీసం మహిళ సర్పంచ్ అనే కనికరం లేదన్నారు.
మాజీ సర్పంచ్ దంపతులను అరెస్టు చేయడం హేయమైన చర్య…
గ్రామ అభివృద్ధిలో భాగంగా వల్లంపట్ల గ్రామంలో పాఠశాల నిర్మాణంతో పాటుగా , గ్రామ అభివృద్ధికి సొంత నిధులతో, పనులు చేసి, శ్రీకారం చుట్టిన వల్లంపట్ల గ్రామ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూర్య, భర్త కేతిరెడ్డి వెంకట్ నరసింహ రెడ్డి లను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని, సర్పంచుల ఫోరం ఖండించింది.