
maknews
-సంఘీభావం తెలిపిన జిల్లా మాజీ సర్పంచుల జేఏసీ
by mak/ ఇల్లంతకుంట
గ్రామ అభివృద్ధిలో భాగంగా తాము చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న మాజీ సర్పంచ్ దంపతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ప్రజా స్వామ్యానికి గోడ్డలు పెట్టని… మాజీ సర్పంచుల ఫోరం ,జిల్లా జేఏసీ అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు.. శుక్రవారం ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ తన భర్త వెంకట నర్సీంహారెడ్డిలు.. తాము చేసిన పనులకు గాను.. బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాలకు.. తాళం వేసి శాంతియుతంగా నిరసన తెలుపు తుంటే.. అధికార పార్టీ అండ దండతో పోలీసులు నిర్దా క్షణంగా సర్పంచ్ దంపతులు ఇద్దరిని లాక్కొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తమ వాహనంలో తరలించడం… అప్రజాస్వామి కమన్నారు. ప్రతి సర్పంచ్ కూడా తన గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడతాడని, ఎంతోమంది సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం తమ వ్యవసాయ భూములను, బంగారు వస్తువులను, తాకట్టుపెట్టి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలుగా బిల్లులు రాక సర్పంచులు మనోవేదనకు గురవుతున్నా, ఇప్పటికే మండలంలో చాలామంది సర్పంచ్లు, అప్పుల కూపిలో ఇరుక్కున్నా రన్నారు. ఇకనైనా మాజీ సర్పంచుల పై ప్రభుత్వం కక్ష సాధింపు సాధించకుండా, చేసిన పనులకు, ఎంబి రికార్డులకు అనుకూలంగా, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మాజీ సర్పంచ్ లను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సిరికొండ శ్రీనివాస్, గున్నాల లక్ష్మణ్, కట్ట వెంకటరెడ్డి, చల్ల నారాయణ, కూనబోయిన బాలరాజు,సిద్ధం శ్రీనివాస్, చింతలపల్లి తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.