
MAK NEWS (అనంతారం) గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అనంతారం సర్పంచ్ వల్లాల రజిత వెంకటేశం గౌడ్ తెలిపారు. అనంతరం గ్రామంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంగన్వాడి ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ వీణతో కలిసి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
“పౌష్టికాహారం తీసుకుందాం ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిద్దాం” మన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ మంగవ్వ, వెంకవ్వ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్ కిరణ్, ఆశ వర్కర్స్ తార, పద్మ, సిఏ లు స్వప్న, జయ తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు ,తదితరులు పాల్గొన్నారు.