
గుంతల రోడ్లతో వరుస ప్రమాదాలు
-నరకకూపంగా రహీంఖాన్‌పేట–సిరిసిల్ల రహదారి
-అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారులు
-రోజుల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు.. తప్పిన ప్రాణనష్టం
-అనంతారం బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేపట్టాలని స్థానికుల డిమాండ్
MAKNEWS/ఇల్లంతకుంట
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట నుండి జిల్లా కేంద్రానికి, అలాగే వెల్జీపూర్ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్ల మరమ్మతులు పట్టించు కోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతోంది.
వరుస ప్రమాదాల జరుగుతున్న పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మధ్య ప్రమాదాలు జరిగిన వివరాలు..
మే 08, 2026: గూడపల్లె నుండి చింతలకుంటపల్లె రైస్ మిల్లుకు వరిధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గుంతల కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆగస్టు 18, 2026: ఇల్లంతకుంట నుండి అనంతారం–రహీంఖాన్‌పేట మీదుగా సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్సు కల్వర్టు సమీపంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు జారిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ప్రాణనష్టం వాటిల్లలేదు, జేసిబి సహాయంతో బస్సును బయటకు తీశారు.
ఆగస్టు 21, 2026: దాచారం గ్రామం నుండి కరీంనగర్‌కు బియ్యం లోడుతో వెళ్తున్న భారీ లారీ, అనంతారం బ్రిడ్జి సమీపంలోని కాలువ ప్రాంతంలో రోడ్డు సరిగ్గా లేక ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
నరకకూపంగా రహీంఖాన్ పేట-వెల్జీపూర్ రహదారి
జిల్లా కేెంద్రానికి వెళ్లే ప్రధానరహదారి నరకకూపంగా మారింది. నిత్యం పెద్దపెద్ద వాహానాలు తిరగండంతో రహదారి పూర్తిగా దెబ్బతింది. లిఫ్ట్ ఇరిగేషన్, ప్రదానకాలువ,టన్నెల్, వంటి
పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలతో రహదారి దెబ్బతిన్న
ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చుపడంతో మరమ్మత్తులు చేపట్టలేకపోయారు. డబుల్ రోడ్డు మంజూరు అయిన, కనీసం పనులు తట్టడే మట్టి–తట్టేడు కంకర పోసేందుకు కూడా రాలేదు.
రహీంఖాన్‌పేట-వెల్జీపూర్ మార్గంతో పాటు అనంతారం బ్రిడ్జి ప్రాంతంలో రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రోజుల వ్యవధిలోనే భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు స్పందించక పోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనంతారం బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, గుంతల రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.