
Mak news/ఇల్లంతకుంట
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన కార్యక్రమాలు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆలయంలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల పెద్దలు ఎర్రోజు వెంకటేశం, ఎర్రోజు ఆంజనేయులు, ఎర్రోజు భాస్కరాచారి, తిప్పారపు సంతోష్, తిప్పారపు శ్రీనివాస్, తిప్పారాపు స్వామి, తిప్పారపు సురేష్, తిప్పారపు శ్రావణ్, సతీష్, నాగరాజు, ఎర్రోజు చంద్రశేఖర్, ఎర్రోజు అభిలాష్, ఎర్రోజు సత్యం, కడార్ల మనోహర్ , తదితరులు పాల్గొన్నా