
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం సృష్టించింది. అభిజ్ఞ అనే విద్యార్థిని కి 587 మార్కులు సాధించి మండలంలో సెకండ్ టాపర్ గా నిలిచింది, వర్షిణి 586 మార్కులు, అర్లిన్ 584 మార్కులు సాధించారు. పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థుల్లో 34 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించి పాఠశాలని టాప్ లో నిలిపారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కృష్ణకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యా యులు , అలాగే సహకరించిన తల్లి దండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిరంతర శ్రమ, క్రమశిక్షణే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు.ఈ విజయంతో పాఠశాల మండల స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.