
maknews tv
ఇల్లంతకుంట ఉప మండల “హిందూ సమ్మేళన” నిర్వహణ సమితి అధ్యక్షునిగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు, తూంకుంట మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా నియమించారు. మండల కేంద్రంలోని వానిణీ కేతన్ హై స్కూల్లో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖండ జాగరణ సమితి సభ్యులు ఎలిగేటి వంశీ, బత్తిని ఆంజనేయులు, కాసుపాక కిషన్, తాటిపల్లి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని ఏడు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప మండల హిందూ సమ్మేళన సమితిని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా తుంకుంట మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఈదుల రవీందర్ రెడ్డి ,కోశాధికారిగా నార్ల రాంకిషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 21వ తేదీన మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాధర క్షేత్రం ప్రక్కన గల మైదానంలో “హిందూ సమ్మేళన” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందువులు, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.