
MAK NEWS ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో ప్రమాదవశాత్తు శనివారం పెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిక్కుడువాని పల్లె గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు ఒక్కదాని పై ఒకటి గాలి దుమారంతో తాకడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న మామిడి తోటలకు వ్యాప్తి చెందడంతో, కోతకు వచ్చిన మామిడికాయలు, మామిడి చెట్లు పూర్తిగా ఖాళీ బూడిద అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ చింత మడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, గ్రామస్తులు వెంటనే మామిడి తోట వద్దకు చేరుకొని మంటలు ఆర్పారు. ఇప్పటికే చాలావరకు చెట్లు, మామిడికాయలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ కానిస్టేబుల్ రాధారపు సురేష్, జిపిఓ రాజు, యూత్ సభ్యులు పూర్తిగా ట్యాంకర్ ను తీసుకొచ్చి మంటలు ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. సుమారుగా నాలుగు టన్నుల మేర మామిడి పంట నష్ట పోయినట్టుగా రైతు, సర్పంచ్ మామిడి కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.