
MAK NEWS (ఇల్లంతకుంట) గంజాయి విక్రయించిన… సేవించిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కుమార్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గంజాయి కోసం తనిఖీలు నిర్వహించారు . ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని వివిధ దుకాణ సముదాయాలలో, పోలీస్ డాగ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత గంజాయి బారిన పడి, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గంగరాజం, గాజుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.