
MAK NEWS సెల్ఫీ సరదా ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ పంపు హౌస్ వద్ద సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ బాలిక.. ఒక్కసారిగా రిజర్వాయర్ పక్కన ఉన్న పెద్ద ట్యాంక్ లో పడటంతో.. మృతి చెందింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల సందర్భంగా చిన్నకోడురు మండలం రాముని పట్ల గ్రామానికి చెందిన వెంకటాపూర్ కీర్తన (10)తన కుటుంబ సభ్యులతో కలిసి తిప్పాపుర్ వచ్చింది. అయితే బోనాల అనంతరం సోమవారం అన్నపూర్ణ రిజర్వాయర్ ను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అక్కడ సెల్ఫీ దిగుతున్న క్రమంలో ఒకసారిగా వెంకటాపూర్ కీర్తన (10) నీటిలో పడి కొట్టు మిట్టాడుతుంది. పక్కన ఉన్నవారు.. నీటి నీటిలోకి దంకి బయటకు తీశారు. వెంటనే హుటా హుటినా ఆసుపత్రికి తరలించిన.. ఆస్పత్రి వర్గాలు బాలిక మృతి చెందినట్లు తెలిపారు. సెల్ఫీ సరదా ఇలా విషాదాన్ని నింపింది.