
(MAK NEWS 29 జూన్) నాణ్యమైన.. ఆరోగ్యకరమైన భోజనం అందించటంతో పాటుగా.. మంచి విద్యను అందించాలని ఇల్లంతకుంట తహాసీల్దార్ రాచకట్ల సురేష్ సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పనితీరును స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి, మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే, ఇలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు విద్యార్థులకు దరిచేరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.