
—పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష అందజేత
-maknews 29జూన్) పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు “వాసంతి దేవి చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మండలంలోని దాచారం హై స్కూల్ లో వాసంతి చారిటబుల్ ట్రస్ట్ ఎస్ వెంకట రమణారావు పేరుపై ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 2025-26 సంవత్సరానికి గాడు పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ. లక్ష బహుమతి అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన బర్ల హర్షితకు 50,000, ద్వితీయ బహుమతి గజ్జల జస్వంత్ 30000, తృతీయ బహుమతి మారవేణి అక్షిత 20వేల రూపాయలను అందజేశారు. తన తల్లి వాసంతి దేవి జయంతిని పురస్కరించుకొని కుమారుడు భరత్ రావు శరత్ రావు మరియు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాణి, సర్పంచ్ కుడుముల రేణుక నాగరాజు, విద్యా కమిటీ చైర్ పర్సన్ ముత్యాలు, ఉపాధ్యాయులు తుంకుంట నరేందర్ రెడ్డి, దావీదు, శ్రీనివాస్, ఆనంద్, సంజీవ్, సురేష్, శ్రావణ్, చంద్రశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.