
మండలంలోని కేశన్నపల్లె గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రిపాల ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వివరించారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడి టీచర్ కొమిరి పద్మ, వార్డు సభ్యులు, తల్లులు పాల్గొన్నారు.