
విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడల్లో రాణించాలని ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన సింగిరెడ్డి వీరారెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులకు టీ షర్టులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం లో ఏఏపిసి
చైర్ పర్సన్ విజయలక్ష్మీ, ఉపాధ్యాయులు జీ రమేష్, సింగిరెడ్డి నర్సీంహారెడ్డి, ఎలుక స్వామి, తిరుపతి రెడ్డి, నర్సీంహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.