
MAK NEWS ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి సిరిసిల్ల కు వెళ్తున్న ఆర్టీసి బస్సు కు పెను ప్రమాదం తప్పింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఇల్లంతకుంట నుండి అనంతారం మీదుగా రహీంఖాన్ పేట మార్గంలో సిరిసిల్ల కు వెళ్తుండగా, అనంతరం-రహీంఖాన్ పేట కల్పర్టు దాటి ఒక్క సారిగా రోడ్డు కిందకు దిగింది. దీంతో అందులో ప్రయాణీస్తున్న ప్రయాణీకులు ఒక్క సారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు దిగి, ఉపిరి పిల్చుకున్నారు. గుంతల రోడ్లతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు తెపిపారు.