
MAKNEWS ఇల్లంతకుంట మండల కేెంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయకుడి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సాముహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనంతరం విశేశ ద్రవ్యాలచే అభిషేకం నిర్వహించారు. దామోదర అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు , ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.