
MAK NEWS ఇల్లంతకుంట మండల కేెంద్రంలోని “లారెన్స్ యూత్” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద ఆదివారం సాముహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనంతరం విశేశ ద్రవ్యాలచే అభిషేకం నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త సిరిపురం అఖిల ఆంజనేయులు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అంతగిరి హరికృష్ణ, రేగుల కార్తీక్, బాలు టైగర్, బోంగోని అనిల్, అంజీ, నాగార్జున, నర్సోజీ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.