
MAKNEWS ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే (ఐపిఎస్) ఆకస్మీకంగా బుధవారం తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా స్టేషన్ లోని రికార్డులను, నేర చరిత్ర కలిగిన వారి వివరాలను తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి మత్తుకు యువత బానిసకావద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తు పట్టుబడితే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వర్ రావు, ఎస్ ఐ సిరిసిల్ల అశోక్ , సిబ్బంది ఉన్నారు.