
MAK NEWS ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు వారి పిల్లలను పంపిస్తేనే ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందివ్వండంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్ద లింగాపూర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని చేశారు. అంగన్వాడి, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని సర్పంచ్ గన్నారం వసంత నర్సయ్య, ఉప సర్పంచ్ రమేష్ , వార్డు సభ్యులు తీర్మానం చేశారు.