
MAK NEWS (అనంతారం) ఏండ్లు గడుస్తున్నా.. అనంతరం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అనంతారం గ్రామానికి చెందిన యువ నాయకుడు “అక్కేం నాగరాజు” ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. పాలకులు మారిన బ్రిడ్జి తలరాత మారడం లేదని.. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ సెప్టెంబర్ 21 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో రోడ్ల వ్యవస్థ అద్వానంగా దాపరించిందని, దీంతో ఆర్టీసీ బస్సులు కూడా మండలానికి రావడం లేదు అన్నారు. నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న కూడా పాలకులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతారం బిక్కవాగు పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టుతున్నట్లు తేలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణకు మోరా పెట్టుకున్న కూడా పట్టించుకోవడంలేదని వాపాయ్యాడు.