
MAKNEWS (ఆరెపెల్లి) ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు గుడి కందుల భూమి రెడ్డి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ఆదివారం మండలంలోని ఉపసర్పంచ్ ల ఆధ్వర్యంలో ఆరేపల్లి లోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎలుక రామస్వామి, మూగు నాగరాజు శర్మ, కోదాని మహేష్, తోపాటుగా తదితరులు పాల్గొన్నారు.